A Rat Entered Into Andalusia Parliament Goes Viral | Oneindia Telugu

2021-07-23 381

In an unusual incident, a rat entered Andalusia Parliament in Spain's Seville city, leading to commotion. The incident happened when the members of Andalusia’s representatives were about to cast their vote on an important issue.
#Rat
#Andalusia
#Parliament
#Sevillecity
#funnyvideo
#funnyratvideo
#Spain

ఎలుకలు అంటే చాలా మందికి భయం. ఒక్క ఎలుక చాలు మనిషిని కంగారు పెట్టి పరిగెత్తించడానికి. కాళ్ల కింద నుంచి ఎక్కడ దూరి ఎటుపోతుందోనని భయపడుతుంటారు. అలాంటి ఎలుక ఏకంగా పార్లమెంట్‌లో దూరి నాయకులను కంగారుతో పరుగులు పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌లోని అండలూసియా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నాయకులంతా సీరియస్‌గా సమస్యలపై చర్చిస్తున్నారు. అండలూసియా పార్లమెంట్ స్పీకర్‌ బిల్లుకు సంబంధించిన చర్చను ముగించి అందుకు సంబంధించిన ఓటింగ్ పక్రియను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ సమయంలోనే అనూహ్యంగా టేబుల్‌ పై ఎలుక కనిపించింది. దాంతో వెంటనే స్పీకర్‌ షాక్ అయ్యారు.